The highest form of action (Karma) is worship of God

కర్మ యొక్క ఉత్కృష్టతే దైవపూజ.

సాధువులకు మహాత్ములకు వారి వారి అభిమానులు, శిష్యులు తరచుగా ఏవో ఒక కానుకలను ఇస్తూ ఉండటం సర్వ సాధారణమైన విషయమే. అలాగే మహాత్ముడైన వ్యక్తి తనకు ఎవరు ఏ కానుకలు ఇచ్చినప్పటికీ వాటిని తనకోసం ఉపయోగించుకోకుండా సమాజానికి వాటిని ఉపయోగపరుస్తూ ఉంటారు.

నారాయణ సంప్రదాయానికి చెందిన స్వామి సజానంద్ కి ఆత్మరామ్ అనే పేరుగల దర్జీ ఒక “అంగీ” ని కానుకగా ఇస్తాడు. చుట్టూ కూర్చొని ఉన్న భక్తులు ఈ అందమైన కానుకను విస్తుపోయి చూస్తూ ఉంటారు. అక్కడే కూర్చొని విజయసింహుడనే రాజుకు ఈ అంగీ బాగా నచ్చి, దర్జీతో, దర్జీ! నీవు ఇంతకంటే బాగా కుట్టగల్గితే నా కోసం మరొకటి తయారుచేయమని ఆజ్ఞాపిస్తాడు.

దర్జీ చిరునవ్వు నవ్వి, రాజా! “పని యొక్క శ్రేష్ఠతను పూర్తిగా అవగతం చేసుకున్న తరువాతనే నేను ఆపని ప్రారంభించి పూర్తి చేస్తాను. కాబట్టి ఇంతకంటే శ్రేష్ఠమైనది తయారుచేయటం అనేది అసంభవం అని సవినయంగా బదులు పల్కుతాడు.

ఒక కమ్మరి పెద్ద పెద్ద సమ్నెటలు తయారుచేయటంలో నేర్పరి. ఒకనాడు ఒక వ్యాపారి కమ్మరి వద్దకు వచ్చి, అతని వద్ద ఉన్న సమ్మెలన్నింటినీ పరిశీలించి చూచి, “అయ్యా! ఇంతకంటే కూడా శ్రేష్ఠమైనవి చేయగల్గితే చేసి ఉంచు, నేను అధిక ధర చెల్లించి వాటిని తీసుకొంటాను” అని కోరుతాడు.

కమ్మరి వ్యాపారివంక స్థిరమైన దృక్కులతో చూస్తూ, అయ్యా! నేను నా సమ్మెటల ఉత్కృష్టతను నా ఉత్కృష్టతగా భావిస్తాను. వాటిలో ఏ మాత్రం లోపం రావటం నేను సహించలేను. ఇంత కంటే ఉత్కృష్టమైనవి నేను చేయగల్గి ఉంటే నా వద్ద అటువంటివే ఉండేవి. కాబట్టి నా సమ్మెటల నాణ్యతను తక్కువుగా అంచనావేసే పనిలేదు. నా కర్మ యొక్క ఉత్కృష్టతే నా దైవపూజ అని బదులు పల్కుతాడు.

న యొక్క సృజనాత్మక శక్తి కారణంగానే మానవునకు సృష్టిలో మరి ఏ ఇతర జీవధారులకు లభించని పదవి గౌరవం లభిస్తున్నాయి. ఆచరించే కర్మల స్థాయి, కర్మ కౌశలం ఉత్కృష్టమైన సృజనాత్మక ప్రయోజనాలతో జోడింపబడితే కర్తయొక్క గౌరవ స్థాయి కూడా ఎంతగానో పెరుగుతాయి.

మానవుడు ఈ వసుధను సుందరంగాను సువ్యవస్థితంగాను తీర్చిదిద్దటానికి వచ్చేడే గానీ నష్టపెట్టటానికి ధ్వంసం చేయటానికి రాలేదు. ఈ మూల ప్రతిజ్ఞను తప్పితే మానవస్థాయి నుండీ దిగజారక తప్పదు.

The highest form of action (Karma) is worship of God

Leave a Comment