Karma does not mean hard work. Karma must also be accompanied by a higher level of mental yoga.

కర్మ అంటే శ్రమించటం కాదు. కర్మతో ఉన్నత స్థాయికి చెందిన మనోయోగం కూడా జోడించబడాలి.

భారతదేశం యొక్క తత్వజ్ఞానం విశ్వంలోని మూలమూలలకు వ్యాపించి దూరదేశాల నుండి యాత్రికులు వచ్చి, భారతదేశం నుండి జ్ఞాన సంపదను ఆర్జించి తమ దేశాలకు తిరిగివెళ్ళి, తమ దేశవాసులకు ఆ భారతీయ తత్వజ్ఞానం యొక్క మర్మాన్ని అవగతం చేస్తున్న రోజులవి.

ఈ పరంపరలోని ఒక బౌధ సాధువు రెండువేల సంవత్సరాల పూర్వం జ్ఞానార్జనకై ఒకసారి భారతదేశానికి రావటం జరిగింది. ఏదో స్వల్పకాలం భారత భూమిపై గడిపి వెళ్ళాలని వచ్చిన ఈ సన్యాసి భారతీయ జ్ఞానసంపద వెదజల్లే వెలుగులో తన్మయుడై 12 సంవత్సరాలం అనేక విద్యాపీఠాలలోను, విశ్వవిద్యాలయాలలోను భారతీయ వేందాంతాన్ని అధ్యయనం చేసి, “పాండు” లిపిలో నున్న అనేక దుర్లభ గ్రంథాలను వెటతీసుకుని చైనాకు తిరిగివెళుతూ ఉండగా మార్గం మధ్యలో తుఫాను ప్రారంభమై ఓడలో నీరు నిండి బరువుతో మునిగిపోసాగింది.

అంతిమ క్షణాలలో కూడా ధైర్యాన్ని కోల్పోక జ్ఞాన గ్రంథాలను అధ్యనం చేస్తూనే, సాధువును తమ అతిధి గా భావించి ఆయనను ఈ ఆపదనుండి ఎలా రక్షించాలా? అని ఆలోచించే ఆ నావలో ప్రయాణించే భారతీయ విద్యార్థులను చూచి సాధువు ఆశ్చర్యచకితుడైనాడు.

చివరకు విద్యార్థులు ఈతగాళ్ళను సలహా అడిగారు. వారి సలహా మేరకు ఓడలో సగం మంది ఉండి మిగతా సగం మంది ఖాళీచేస్తే ఓడను, ఓడలో ఉన్నవారిని రక్షించటం వీలవుతుందని గ్రహించారు. వెంటనే భారతీయ విద్యార్థులు అఘాతం లాంటి సింధు మహాసముద్రంలో దూకి ప్రాణత్యాగం చేస్తారు. సన్యాసి, త్యాగభూమీ! ఓ భారతభూమీ! అంటూ ఎలుగెత్తి భారతభూమికి జేజేలు పల్కుతాడు కన్నీళ్లతో.

సంస్కృతి సమాజాల రక్షకులైన ఇటువంటి త్యాగమూర్తులే జనులు హృదయాలను నిద్రలేపి మేల్కొల్పగల మహనీయులు, వీరియొక్క పరమార్థ నిష్ఠవల్లనే సమాజం సంస్కృతి వికసించి పుష్పించి ఫలిస్తోంది. అంటూ భారత ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తాడు సన్యాసి.

కర్మ అంటే శ్రమించటం కాదు. కర్మతో ఉన్నత స్థాయికి చెందిన మనోయోగం కూడా జోడించబడాలి. ఉపేక్షతో అన్యమనస్కంగా ఆచరించే పనులు కర్తను అప్రతిష్ఠపాలు చేసి నిష్పలమవుతాయి. ఏ వృత్తి లభిస్తే అది ఈశ్వర పూజగా భావించాలి. కర్మ, కౌశలం, స్వాభిమానంకల ప్రతి వ్యక్తికి కీర్తి ప్రతిష్ఠలనిస్తుంది. రైదాస్ చెప్పులు కుట్టి సంపాదించిన డబ్బులు గంగామాత చేయిజాచి స్వీకరించింది.

కబీరు బట్టనేస్తూ కూడా ఆయువు యొక్క ప్రతీ శ్వాస, కాలంలోని ప్రతీ క్షణం కలిసి జీవితం అనే దుప్పటిని నేస్తున్నట్లుగా అనుభూతి చెందేవాడు. ఈ తన్మయత్వమే సాధారణమైన కార్యక్రమాలను కూడా ఉపాసనగా మార్చివేస్తాయి.

ప్రార్ధనా సమావేశంలోను, పాయిఖానా శుభ్రం చేసేటప్పుడు కూడా గాంధీజీ ఒకే విధమైన తన్మయత్వంతో ఉండేవారు. అందువల్లనే వారు ఉత్కృష్ఠమైన నిర్మలమైన జీవితానికి అధికారి కాగలిగారు.

Leave a Comment