Each Step Definitely Leads to a Better Path.

ఒకొక్క అడుగు ఖఛితంగా మంచి మార్గము వైపు తీసుకువెళ్తుంది.

Each Step Definitely Leads to a Better Path.

ఒక రైతు తన కుమారులకు రాబోతున్న వర్ష ఋతువులో పంటను నాటవలసిన బాధ్యత ఒప్పగిస్తాడు. వారు సరేనని అంగీకరిస్తారు. చెప్పిన ప్రకారం వర్ష ఋతువు రానేవచ్చింది. కుండపోతగా వర్షం పడింది. కుమారులు వెళ్లి దాచి పెట్టిన విత్తనాలు పొలంలో వెదజల్లి వచ్చేరు. నాల్గుగు రోజుల తరువాత తండ్రి వచ్చి విషయాన్ని విని తలబాదుకొన్నాడు. నాయనలారా! ముందు నేలను శుభ్రం చేయకుండా విత్తనాలు జల్లితే ఏమి ప్రయోజనమయ్యా! పంట చేతికి రావాలంటే విత్తనాలు మొలకెత్తాలి. విత్తనాలు మొలకెత్తటానికి సంస్కరించిన నేల కావాలి. అంటూ వారి పొరపాటు వారికి తెలియ జేస్తాడు.

విధివిధానాల గొప్పతనం సర్వవిదితమే. కానీ మిడిమిడి జ్ఞానంతో చేసే కృషి నిష్పలమై పోతుంది అని ఈ కథ తెలితజేస్తుంది.

మహర్షి ఇంకా ఏమన్నారంటే నాయనలారా! జీవనదేవత ప్రతి వ్యక్తిలోను విరాజమానురాలై ఉన్నది. కానీ వ్యక్తి యొక్క దృష్టికోణం విస్తృతమైన పరిధిని చేరగల్గినపుడే ఆ దేవత యొక్క ప్రభావం పరిణామం అవగతమవుతాయి. వ్యక్తి యొక్క ప్రామాణికత అతనికి ఒప్పగించిన బాధ్యత నిర్వహణ మీద ఆధారపడి ఉంటుంది. దైవం ప్రసాదించిన జీవితాన్ని ఎంత సదుపయోగం చేస్తే అంతగానూ అతను అనుగ్రహించబడతాడు పరీక్షలో పాసైన వ్యక్తికి ప్రమోషను వచ్చినంత సులువుగా జీవన సంపదను సదుపయోగం చేసిన వానికి భౌతిక ఆత్మగత జగత్తులో శ్రేయస్సు దక్కుతుంది.


ఒక యజమాని పిల్లలు పరమ సోమరులు. పనిపాటలను ఎగవేస్తూ వ్యర్థమయిన మాటలు కార్యకలాపాలతో కాలాన్ని దుర్వినియోగం చేసేవారు. మరణ సమయం ఆసన్నమయిన తండ్రి పిల్లలను దగ్గరకు పిలిచి వారి సోమరితనాన్ని దూరం చేయాలనే ఆఖరు ప్రయత్నం చేస్తూ ఒక విషయాన్ని తెలియజేసాడు. నాయనలారా! మన తోటలో ప్రతి చెట్టుక్రింద బాగా త్రవ్వి కొంత బంగారం దాచాను. అవసరం పడినపుడు త్రవ్వి తీసుకోండి. అని చెప్పి కన్నుమూస్తాడు. తండ్రి మరణానంతరం ఇంట్లో సంపద సమాప్తమవుతుంది.

ఆకలితో అలమటించే కొడుకులు బంగారం కోసం తోటలో చెట్లక్రింద త్రవ్వసాగేరు. బంగారం ఎంత త్రవ్వినా లభించలేదు. సత్యవాక్ పరిపాలకుడైన తండ్రి అబద్దం చెప్పే అవకాశంలేదు అనుకుని ఆశ్చర్యపోయేరు. ఇంతలో వర్షాలు పడ్డాయి. కొడుకుల ద్వారా చెట్ల చుట్టూ తవ్వబడిన బోదెల ద్వారా చెట్లు కావల్సినంత నీటిని సంగ్రహించి ఏపుగా పెరిగి పుష్పించి ఫలించి ఆ సంవత్సరం హద్దులేని ఫలసాయం వారికి లభించింది. తండ్రి మాటలోని శాశ్వత సత్యాన్ని ఆనాడు కుమారులు తెల్సుకొన్నారు.

ఆభరణాన్ని మెడలోనే ధరించినా, ఆ ధరించిన విషయాన్ని వ్యక్తి మరచిపోవటంవల్ల ఆభరణాన్ని పోగొట్టుకొన్నట్లుగా బాధపడుతూ ఉంటాడు. అంతరంగంలో నిండి ఉన్న అమూల్యమైన సంపద గురించి మరచిపోయి, తన జ్ఞానం, తన శక్తులు గురించి సరిఅయిన అవగాహన, లేక వ్యక్తి వ్యర్థంగా జీవిత కాలాన్ని గడిపేస్తాడు. తన అదృష్టం అంతేనని, గొప్పవారిలా జీవించే యోగం తన నుదుట వ్రాయలేదనీ, తన దౌర్భాగ్యం తనను ఇటువంటి పరిస్థితుల మధ్య కు లాక్కొచ్చి పడవేసిందనీ ఇలా ఎవరో ఒకరిని బాధ్యుల్ని చేసి బ్రతికేయటానికి అలవాటు పడతాడు.

Leave a Comment