గురువు ఇచ్చిన ప్రేరణను అండగా తీసుకుని మీ అత్మ శక్తితో ప్రతి పనిని సాధించండి.

శ్రీ రామకృష్ణ పరమహంస దేహాన్ని వదిలిన తరువాత శిష్యులు, గురువు తమ కోసం ఒక మఠాన్ని గానీ, ఆశ్రమాన్ని గానీ ట్రస్టును గానీ స్థాపించి వెళ్లలేదని విచారాన్ని వ్యక్తం చేస్తారు. వివేకానందుడు వారి విచారాన్ని దూరం చేస్తూ, సోదరలారా! మన గురువు మనకు జీవితాన్ని ఎలా జీవించాలో తెలిపే విద్యని నేర్పాడు.
వివేకానందుని సందేశంలోని శక్తి వారిలోని విచారాన్ని దూరంచేసింది. అందరూ సంఘటితులయ్యేరు. ప్రతి ఒక్కరూ వివిధ దిశలలో వ్యాపించి ఒక పెద్ద వైభవ సామ్రాజ్యాన్ని స్థాపించేరు. అవి ఈనాడు దేశ విదేశాలలో రామకృష్ణ మిషన్ పేరున వెలసి వెలుగును వెదజల్లుతున్నాయి.
వివేకానందుని సందేశంలోని శక్తి వారిలోని విచారాన్ని దూరంచేసింది. అందరూ సంఘటితులయ్యేరు. ప్రతి ఒక్కరూ వివిధ దిశలలో వ్యాపించి ఒక పెద్ద వైభవ సామ్రాజ్యాన్ని స్థాపించేరు. అవి ఈనాడు దేశ విదేశాలలో రామకృష్ణ మిషన్ పేరున వెలసి వెలుగును వెదజల్లుతున్నాయి.
జీవించే కళ మనవద్ద వున్నది. నియమ నియంత్రణల రూపంలో మనకు అతి ప్రధానమైన శిక్షణను మన గురువు ప్రసాదించాడు. వీటి ద్వారా మనం సంస్కృతి పునర్జీవింప చేయటానికి కావలసిన తప్పనిసరి సాధనాలను అవలీలగా సమకూర్చుకోగలం. వీటి ద్వారానే మనలను మనం సమర్థులుగాను వైభవంకల వారిగాను తీర్చిదిద్దుకోగలం.
గురువు యొక్క సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయటానికి నియమ నియంత్రణాలను మించిన సాధనలు మరేవి లేవని వివేకానందుడు తోటి సోదరులకు తెలియజేస్తాడు. మహిష్మతి యొక్క ప్రథమ పౌరుడైన కరుణాకరుడు ప్రచుర సంపదకు అధిపతి. ఒకసారి ఆయన తన సంపదను మిత్రునికి ఒప్పగించి ఒక సంవత్సరం కల్పసాధన నిమిత్తం అంగిరా మహర్షి ఆశ్రమానికి వెళ్లటం జరిగింది. సాధనలో భాగంగానే వారు జన్మ కల్యాణం కోసం తీర్థయాత్రకు వెళ్లి సాధన పూర్తిగావించుకొని తిరిగివస్తారు.
ఈయన సంపదను మిత్రుడు రక్షించలేక దొంగలపాలు చేసి దుఃఖిస్తూ ఉంటాడు. కరుణాకరుడు దుఃఖించే మిత్రుని ఓదారుస్తూ, మిత్రమా! వ్యక్తి భూమిమీదకు నగ్నంగా బట్టయినా వెంట లేకుండా దిగివస్తాడు. వచ్చిన తరువాతనే కదా పరిజనుల స్నేహ సహకారం, ఇంద్రియ పటుత్వం, ఆలోచనా శక్తి, సమయ సద్వినియోగం వీటన్నింటినీ ఉపయోగించుకొని సంపన్నుడవుతాడు.
దైవ కృపవల్ల పైన పేర్కొన్న శక్తులన్నీ ఇంకా నా వద్ద పుష్కలంగా ఉన్నాయి. వాటికితోడు జీవితంలోని అనేక అనుభవాలు, ఆలోచనలలో పరిపక్వత ఇంకా అదనంగా ప్రస్తుతం నా వద్ద ఉన్నాయి. వీటి ద్వారా పోయిన సంపదను తిరిగి సంపాదించటం పెద్ద కష్టమేమీకాదు, అని మిత్రునికి సత్యాన్ని తెలియజేస్తాడు.
చెప్పటమే కాక చేసి చూపించి, కరుణాకరుడు కీర్తికి, వైభవానికి, సంపదకు మరల అధిపతి అవుతాడు.
ఆయనను కొనియాడవచ్చిన ప్రతి ఒక్కరితో కరుణాకరుడు ఏమనే వాడంటే, సోదరులారా! నావలె మీరందరూ కూడా తయారు కాగలరు. ఇదంతా “దైవం ద్వారా ప్రసాదించబడిన సాధనాల సదుపయోగం” యొక్క ప్రతిక్రియే గానీ చమత్కారమేమీకాదు. ప్రతి ఒక్కరూ ఆనందంగా సంపన్నంగా జీవించటానికి కావల్సిన సాధన సంపదను ప్రసాదించిన పరమాత్ముడు గొప్పవాడు అని చప్పేవాడు.
ఇంద్రియాలలో రెండు అతి ప్రధానమైనవి. 1. జిహ్వ 2. జననేంద్రియం. జిహ్వ పట్ల నియంత్రణ లేకుండా ఏదిపడితే అది మాట్లాడటం, రుచులు కోరుతూ భుజించటం మనం చేసే పెద్ద పొరపాటు. జిహ్వకు శరీరారోగ్యానికి సరాసరి సంబంధం ఉన్నది. అవసరం లేకపోయినా రుచికి ప్రాధాన్యతనిస్తూ మనం జిహ్వ ద్వారా స్వీకరించే ఆహార పదార్థాలు అనేక రోగాలకు కారణమై హాని కల్గిస్తున్నాయి.
ఆరోగ్యమే మహా భాగ్యంగా భావించి కాపాడుకోవల్సిన వ్యక్తి జిహ్వ పట్ల నియంత్రణ లేకపోవటం వల్ల రోగాలను తనకి తానే ఆహ్వనించి రోగిగా తయారవుతున్నాడు. అలాగే జననేంద్రియాల కర్తవ్యం మలిన పదార్థాలను వసర్జించటం, సంతానాన్ని ప్రసాదించటం. జననేంద్రియాలను నియమ బద్ధంగా ఉపయోగించుకొని నియంత్రణను పాటిస్తే మనోబలం వృద్ధి చెందుతుంది. అలాకాక నియమ నియంత్రణలను ఉల్లంఘిస్తే దురాలోచనలు, మానసిక రోగాలు వ్యక్తిలో ప్రవేశించటమే కాక నికృష్టమైన సంతానాన్ని కూడా కనవలసి వస్తుంది. కాబట్టి ఈ రెండు ఇంద్రియాలను చాలా పవిత్రంగా ఉపయోగించుకోవాలి.