Live with Love, Serve with a Pure Heart.

త్యాగం చెయ్యటం, ఇతరులకు సహాయం చెయ్యటం అనేవి తమకు తాము ఉద్ధరించబడటానికి లభించిన ఒక వైజ్ఞానిక ఉపచారం. ఇతరులకు మనము ఏదైతే ఇస్తామో అది రెట్టింపై మనకోసం దైవంయొక్క ఖజానాలో జమచేయబడుతుంది. తన రొట్టెను ఇతరులతో కలిసి పంచుకొని తినేవారికి
దేనికీ లోటునేది ఏర్పడదు. కేవలం స్వార్థంతో తమ తిండి, తమ సుఖం తాము చూసుకొనే దురదృష్టవంతులే త్యాగంలో ఉన్న మధురిమను జారవిడచుకొంటూ ఉంటారు.

ఉన్నత ఆదర్శాల పట్ల ఘనిష్టమైన ప్రేమ, శ్రద్ధ, ఎంత ఎక్కువ ఉత్పన్నమైతే వ్యక్తిలో ఈశ్వరునిపట్ల అంత ఎక్కువగా భక్తి ప్రపత్తులు ఉత్పన్నమౌతున్నట్లు గుర్తింపవచ్చు. ఈశ్వరారాధన సఫలమౌతున్నదీ లేనిదీ స్పష్టంగా అర్థమౌతూనే ఉంటుంది. నిజమైన భక్తునిలో “ఆత్మవత్‌ సర్వభూతేషు” అను ఉత్కృష్టమైన దృష్టికోణము, వసుధైవ కుటుంబక భావన, ప్రతి చిన్న కార్యకలాపంలోను స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది.

ప్రేమయే పరమేశ్వరుడు. కాబట్టి భక్తుడు జడమైనవి, చైతన్యమైనవి – అన్నింటినీ సమంగా ప్రేమించగలిగే స్థితిలో ఉంటాడు. తనను అంతటా అందరిలోను దర్శించగలగటం. వసుధాస్థలి సర్వస్వం స్వకుటుంబంగానే అనిపించటం, జీవితంలోని ప్రతి క్రియాకలాపం కూడ పారమార్థికమై ఉండటం – ఇవి ఈశ్వరభక్తుల ముఖ్యలక్షణాలై ఉంటాయి.

చాలాకాలంక్రితం ఆకాశం నుండి “ఎవరు నీవు” అనే ప్రశ్న వినిపించింది. సమస్త జీవులు ఆశ్చర్య చకితులై ఆకాశం వంక చూడసాగేయి. మరల అదే ప్రశ్న ఒకటి రెండు సార్లు వినిపించింది. ప్రాణులన్నీ విస్మయంగా పైకి చూశాయి. నాల్గవసారి ప్రశ్న వినిపించేసరికి ప్రాణిలోకం వినీ విననట్లు తమపని తాము చూసుకోవటం మొదలుపెట్టింది. ఒక్క మానవులు మాత్రం ఆ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఒకరినొకరు, ఎవరు ఎవరని ప్రశ్నించుకోసాగారు, ఆ అజ్ఞాత కాలంలోని ఆ ప్రశ్న – ఈనాటికీ ప్రశ్నగానే మిగిలిపోవడమే గాక, ఆ ఒక్క ప్రశ్న మానవుని ఆలోచనలను పరుగులు పెట్టించి, పరివర్తన చెంది అనేక ప్రశ్నలుగా పరివర్తన చెందింది.

ఒకే ఒక ప్రశ్న అనేకత్వంపట్ల ప్రభావితురాలై తన మౌలిక రూపాన్నే విస్మరించకుండా, నీవు ఎవరో, నేను అదే అని మానవునిచేత బదులు పల్కించి ఉంటే పరిస్థితులు ఎంత బాగుండేవి.

Live with Love, Serve with a Pure Heart

Leave a Comment