Don’t wander in the ruins of old memories.

Don't wander in the ruins of old memories.

వింధ్య పర్వత శిఖరం మీద ఉత్తర దక్షిణ దిక్కులలో రెండు చీమలు నివసిస్తూ ఉండేవి. ఉత్తరాన ఉన్న చీమ నావద్ద కావల్సినంత పంచదార ఉన్నది కోరినంత తిని నోరు తీపిచేసుకోమని రెండవ చీమను ఆహ్వానిస్తుంది. ఆహ్వనాన్ని మన్నించి వచ్చిన చీమ పరిసరాలన్నీ తిరిగి సాయంత్రం చికాకుతో ఉత్తరాన్న ఉన్న చీమను తిట్టిపోస్తూ, నన్నెందుకు మోసగించావు? పంచదార ఎక్కుడా లేదని చెప్పి కోపంతో వెళ్లిపోతుంది.

ప్రక్క కుటీరంలో కూర్చొని ఈ చీమల వ్యవహారాన్ని తిలకిస్తున్న ఒక శిష్యుడు గురువుతో గురుదేవా పంచదార గుట్ట మీదనే తిరిగినా చీమకు పంచదార లభించకపోవటానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు.

గురువు నవ్వి, ఉప్పు లో తిరిగి తిరిగి సర్వం ఉప్పుమయంగా మారటం వల్ల పంచదారలో తిరిగినా దానికి తీయదనం తెలియలేదని గురువు తెలియజేస్తాడు. వ్యక్తులు కూడా తమ పాత సంస్కారాలను వదులుకోలేక పోవటం వల్ల పరమాత్మ తమలోనే నివసిస్తున్నా ఆయన పిలుపును అందుకోలేక ఆయన కృపనుండి వంచించబడుతున్నారు. క్రొత్తవి పొందాలి అంటే పాతవి వదలుకోవాలని ఈ కథ తెలియచేస్తుంది.

పిప్పలాద మహర్షి ఇంకా ఏమన్నాడంటే! బ్రహ్మ విద్యాసాధనలో నిమగ్నమైన ఓ బ్రహ్మవేత్తలారా! ఆత్మ యొక్క సామర్ధ్యాన్ని అర్థం చేసుకోండి.

ఆత్మపై విశ్వాసముంచండి. మీకేదైనా సహాయం అవరమైతే సర్వసమర్థుడైన దైవాన్నే కోరుకోండి. ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి. దైవానుగ్రహం వ్యక్తి పాత్రతను బట్టి మాత్రమే లభిస్తుంది అంటూ ఒక శాశ్వత సత్యాన్ని మహర్షి జిజ్ఞాసువుల ముందు ఉంచటం జరిగింది.

వానరులు పూర్తి శక్తి సామర్ధ్యాలను వినియోగించి శత్రువులను ఎదుర్కొన్నారు. కానీ అసురులు మాయపన్నటంతో వారు వారి శక్తిని పరిమితమైనదిగా భావించి తమ ప్రభువు రామచంద్రుని ధ్యానిస్తారు. ఆయన తక్షణం ఎట్టెదుట ప్రత్యక్షమై శత్రునాశనం చేస్తాడు. వానరుల యొక్క ఈ విధమైన దృష్టి కోణం వారిని చరిత్రలో అమరులుగా నిలబెట్టింది. వారి జీవితాలను రామకార్యానికి అంకితం చేసి ధన్యం గావించింది.

ఆదిశంకరాచార్య అనాచారాలకు విరుద్ధంగా పోరాడి ధర్మతంత్ర పరిశోధనకు సంకల్పించినపుడు అయనకు మాంధాత సంపద, ప్రజాసహకారం సమృద్ధిగా అందాయి. సత్కర్మాచరణకు తమ పరిపూర్ణ శక్తిని వినియోగించిన వారికి దైవం సమస్త సహాయాన్ని తన పరిపూర్ణమైన అనుగ్రహాన్ని క్షణాలమీద అందేలా చేస్తాడు.

The Ant, Sugar and The Sweetness of Life

Leave a Comment