Dispassion must be shown for the purpose.

వైరాగ్యం లక్ష్యం కోసం చూపించాలి.

Dispassion must be shown for the purpose.

నరేంద్రుడు తరచుగా పరమహంస వద్దకు దక్షిణేశ్వరానికి వెళుతూ ఉండేవాడు. త్రికాలజ్ఞుడైన పరమహంసకు నరేంద్రుని భావి స్వరూపం తెలుసు. కానీ సంసార బంధనాల నుండి శిష్యుణ్ణి విడిపించి, ఆత్మబోధ చేయడానికి ఆయనకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే నరేంద్రునికి ఎన్ని అవకాశాలు కల్పించినా పరమహంస ముందు అతడెప్పుడూ తన ఉద్యోగం గురించే నివేదించేవాడు.

ఇంక చిట్టచివరకు పరమహంస నీ సమస్య కాళీమాత చరణాలవద్ద సమర్పించు అంటూ ఆదేశించాడు. ఆ విరాట్ స్వరూపాన్ని దర్శించి ముగ్దుడైన నరేంద్రుడు భవబంధ విముక్తుడై ఉద్యోగం మాట మరచి ఆత్మశక్తిని, భక్తిని మాత్రమే కోరుకుని తిరిగివస్తాడు. రామకృష్ణుని మార్గదర్శనంలో లభించిన ఈ కాళీమాత సాక్షాత్కారమే ఆనాడు నరేంద్రుని వివేకానందునిగా మార్చివేసింది. సద్గురు ప్రాప్తి గొప్ప మహద్భాగగ్యం. ఇవి ఎవరికి, ఎప్పుడు, ఎవరిద్వారా లభించినా వారు పరమ లక్ష్యాన్ని చేరుకోగల్గుతారు. అంతేగాక మార్గంలో ఎదురయ్యే అవరోధాలన్నింటినీ అవలీలగా అధిగమించి ముందుకు పయనించగల సామర్ధ్యం వీరికి లభించి తీరుతుంది.

ఆత్మ ప్రగతి యొక్క రెండవ సోపానం కర్మ. కర్మ అంటే కర్మ యోగం. మానవత్వానికి సంబంధించినటువంటి బాధ్యతలను, కర్తవ్యాలను నిర్వర్తించటం పట్ల అప్రమత్తత కల్గియుండి, సంచిత కుసంస్కారాల కారణంగా ఉత్పన్నమయ్యే ద్రుష్పవృత్తుల పట్ల నియంత్రణను పాటిస్తూ, స్వభావంలో సత్ర్పవృత్తులు వృద్ధి చేసుకుంటూ మానవుని యొక్క ప్రామాణికత, ప్రతిభలను ఋజువు చేయగల్గిన దానినే కర్మయోగమని అంటారు.

ప్రజ్ఞాశిబిరం యొక్క మూడవరోజు సంయమశీలత, కర్తవ్య ప్రకరణాలకు సంబందించిన చర్చలో పిప్పలాద మహర్షి కర్మయోగము, సంయమనము వీటి మధ్యగల ఘనిష్ఠ సంబంధాన్ని తెలియజేస్తూ “ఉన్నతమైన ఉద్దేశ్యాలతో జోడింప బడిన కర్తవ్యాలను నిర్వర్తించటం వల్లనే మానవుడు విశ్వంభరుడుగా చెప్పబడుతూ ఉంటాడని” తెలియజేస్తారు. తిరిగి ఈనాడు మానవుని చేతనాక్షేత్రం యొక్క మూడు ధారలను గూర్చి చర్చిస్తూ వారు ఆత్మజ్ఞానం తరువాత కర్మనిష్ఠకు ప్రాధాన్యత నీయటం జరిగింది.

కర్మ అందరూ చేస్తారు. కానీ ఆత్మప్రగతికి సంబంధించిన కర్మయోగం యొక్క విశిష్టతను తెలియచేయవలసినపుడు మానవత్వంతో జోడింపబడి దిశాబద్ధమైనప్పుడే అది పురుషార్థాన్ని ఫలింపచేసి సాఫల్యాన్ని కల్గిస్తుందని పేర్కొనబడింది. ఇటువంటి కర్మయోగులు అనంతమైన నమ్మకంతో ఈశ్వరుడు తమకు అప్పగించిన బాధ్యతలను భక్తి ప్రవృత్తులతో నిర్వర్తిస్తూ దానితోబాటు ఆత్మ నియంత్రణను అభ్యాసం చేస్తూ తమ ప్రతిభను పూర్తిగా మంచి ప్రయోజనాలలోనే వినియోగిస్తారు.

Leave a Comment