A sense of care and devotion towards the Goddess of Life within everyone should be awakened.

జీవన దేవత పట్ల ప్రతి ఒక్కరిలోనూ శ్రద్ధ, భక్తి జాగృతమవ్వాలి.

ఒక దొంగ గురునానక్ వద్దకు వెళ్లి ఈ చెడు వ్యసనం నుండి బయట పడటానికి ఏదైనా ఉపాయం చెప్పుమని ప్రార్థించేవాడు. కానీ నానక్ చెప్పిన సలహాలను ఏ మాత్రం పాటించలేక విఫలమవుతూ చాలా సంవత్సరాలు గడిచేయి. ఒకనాడు నానక్ దొంగను పిలిచి నీవు చేస్తున్న పాపాన్ని ప్రతిరోజు అందరి ముందు ప్రకటించుమని సలహా ఇచ్చేడు. ప్రకటించటానికి అతను చాలా సిగ్గుపడేవాడు. ఈ కారణంగా అతడు నెమ్మదిగా దొంగతనం చేయటం మానుకొంటాడు.

దయానంద మహర్షికి అమీచంద్ర అనే శిష్యుడు ఉండేవాడు. చాలా బాగా పాడుతూ ఉండేవాడు. తబల కూడా వాయించేవాడు. కానీ అతనికి మద్యపానం చేసే అలవాటు ఉండేది. ఈ దుర్వృసనం కారణంగా తోటి శిష్యులు అమీచంద్రుని ద్వషిస్తూ గురువుతో, “గురుదేవా! వీడిని మన వెంట త్రిప్పుకొంటే మన పరువు కూడా పోతుంది. వదలివేద్దాం” అని సలహా ఇస్తారు.

శిష్యుల సలహాను దయానందుడు తిరస్కరిస్తూ “నాయనలారా! మొదట్లో ఇతడు వినోదానికి, పొట్ట నింపుకోవటానికి పాటలు పాడేవాడు. మన వద్దకు వచ్చిన తరువాత భగవంతుని కోసం పాడటం ప్రారంభించేడు. ఈ మార్పు చిన్నదేమీ కాదు కాబట్టి ఇతడు క్రమంగా తనంత తానే మారగలడు” అని వారికి హామి ఇస్తాడు. అక్షరాలా అలాగే జరిగింది కూడా. మద్యపానం దుర్వృసనంగా భావించి త్యజించటమే కాక ప్రేరణనిచ్చే ప్రభువు సందేశాలను పాటలుగా పాడి వ్యాప్తి చేస్తూ, సమాజ కల్యాణ కార్యక్రమాలలో గురువుకు “అమీచంద్ర” అన్ని విధాల సహకరించేవాడు.

ఆరణ్యక శిబిరం యొక్క ముడవ సమాధానం అందరి బాగా నచ్చింది. జీవన దేవతపట్ల ప్రతి ఒక్కరిలోనూ శ్రద్ధ, భక్తి జాగృతమైనాయి. జీవితం “అయమాత్మ పరబ్రహ్మగా భావించి, జీవితాన్ని ప్రసన్నం గాను సంస్కార వంతంగాను ఉంచటానికి సర్వ విధాలా ప్రయత్నిస్తామనీ, ఏ లోటుపాట్లు జరగనీయమని వారంతా శపథం చేస్తారు.

మహర్షి యొక్క ప్రసంగం జిజ్ఞాసువులకు ఇంకా ఇంకా తెల్సుకోవాలనే ఉత్సాహం కల్గించే విధంగా ఉన్నప్పటికీ సూత్ర సంచాలకుని ఆజ్ఞమేరకు నియమిత సమయానికి నిష్కృమించక తప్పలేదు.

Leave a Comment