Beyond Karma: The Hidden Essence of a Meaningful Life

అద్వితీయమైన సుక్ష్మ బుద్ధిగలవాడు, తర్క ప్రవీణుడు అయిన ఉద్దాలకుడు మొట్టమొదటి పంక్తిలో ఆసీనుడై ఉన్నాడు. ఆయనలో నిండి ఉన్న ఉత్సాహం, కుతూహలం స్పష్టంగా మహర్షి కన్నులకు కనపడసాగింది. ఉద్దాలకుడు లేచి నిలబడి మహర్షికి పాదాభివందనం చేస్తూ యేమన్నాడంటే: ఓ మహత్మా! కర్మ ద్వారానే సమయం యొక్క సదుపయోగం అవుతుందని గతంలో మీరిచ్చిన విశ్లేషణ ద్వారా నాకొక సందేహం కల్గుతోంది.

అందరూ ఒకే విధమైన కర్మ చేయుటలేదు. కర్మ విధి వ్యవస్థ యొక్క మర్యాదా బంధనం. అటువంటప్పుడు కర్మ ఆత్మ ప్రగతికి అనివార్యమైనదిగా భావించటం వల్ల వ్యక్తి యొక్క లక్ష్యం సిద్ధించదు కదా! విధి వ్యవస్థ ననుసరించియే జీవుడు కర్మ చేసేటప్పుడు “అహం” అనేదాన్ని వదలడం, ఆ అనంత తత్వంలో తనని తాను విలీనం చేసుకోవటం ఎలా వీలవుతుంది? ఇది తెలిస్తే గాని చర్చ సంపూర్ణం గాదు; అంతేగాక – ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ పోయే కర్మ, బాధ్యత నిర్వహణ ఇవి జీవితం యొక్క వ్యావహారిక పక్షానికి చెంది జీవికి, జీవితానికి న్యాయం చేయవచ్చు.

ఇవికాకుండా హృదయాల నుండి ఉద్భవించి పొంగి పొరలే ఉన్నత స్థాయికి చెందిన సంవేధనలు, పారమార్థిక చింతనలు ఆత్మను అనిర్వచనీయమైన శాశ్వతానందానుభూతికి కొనిపోగలవు. ఇదే ఆత్మలో నిండియున్న పరమాత్మ తత్వం. ఇది కరువైన జీవితాలు శుష్కమై, నిష్పృయోజనంగా మిగిలిపోతాయి. అయితే ఈ అమృతత్వాన్ని జీవితంలో వర్షింప చేసికోవటం ఎట్లా? దీని ద్వారా తాను లాభాన్వితుడవటమే గాక ఇతరులకు కూడా ఎలా లాభాన్ని చేకూర్చాలో తెలియజాలని నాడు ఆధ్యాత్మ వేదాంతం యొక్క విశ్లేషణ అర్దాంతరంగా మిగిలిపోతుందని ఉద్ధాలక మహర్షికి బాగా అవగతమైంది.

మనిషికి ప్రకృతి ద్వారా లభించిన సంపదలు నియమపూర్వకంగా సంరక్షించుకోవటం, సరియైన విధంగా ఉపయోగించుకోవటం అవసరమే; కాని స్థూల దృష్టితో మాత్రమే చూచే వ్యక్తులు మానవ జీవిత వికాసానికి ఇంతవరకూ చాలునని ఇకపైన యేమీ అవసరం లేదని తప్పుడు అభిప్రాయం కల్గి ఉంటారు.

మానవుడు తన కౌశల్యానికి, వ్యవస్థకి పరిమితమైనవాడు కాదు. ఇంతవరకే పరిమితమై ఉన్నట్లయితే సంవేదనలు, అనుభూతులు ఆత్మీయతలు వంటి భావాల యొక్క అవసరంగాని సంగీతం, నాట్యం, కవిత్వం వంటి కళలయొక్క అవసరంగానీ ఏ మాత్రమం ఉండేది గాదు.

తల్లి పుత్రప్రేమ కోసం తన సర్వ సుఖాలను తృణప్రాయంగా వదలివేయగలదు. అలాగే బిడ్డ తల్లి వక్షస్థలం మీద విశ్వంలోనున్న సర్వ సుఖాలను అనుభవించగలడు. భార్యభర్తలు పరస్పర ప్రేమానురాగాలతో దారుణమైన విపత్తులను కూడా నవ్వుతూ సునయాసంగా ఎదుర్కొనగల్గుతారు. ఇటువంటి వన్నీ అంతరంగంలో ప్రవహించే అమృత ధారల యొక్క బాహ్యభివ్యక్తి మాత్రమే గాని పై పై కార్యకలాపాలు ఎంతమాత్రము కాదు.

సమయం, కర్మ ఈ రెండింటి యొక్క సమన్వయంతోను అనేకమంది మోహగ్రస్తులు మహత్వ కాంక్షాపరులు కూడా లాభాలను పొందుతూనే ఉంటారు. నిత్య జీవితంలో అనేకమైన కర్మలు యంత్రాల ద్వారా సునాయాసంగా జరగడం చూస్తూనే ఉన్నాము. అంతేగాక యాంత్రిక కర్మ కూడా సాఫల్యానికి జన్మధాత్రిగా అంగీకరించబడుతూనే ఉంది.

కర్మయోగులే కానవసరం లేదు. శ్రమశీలురు, కష్టించేవాళ్ళు గూడా ఎన్నో లాభాలు పొందుతుండటం మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఆ లాభాలకు కారణం పురుషార్థం అని మాత్రమే అంటాము. జీవన సంపదను సార్థకంచేసిన వారుగా వారిని ఎలా అంగీకరించగలం? శ్రమశీలత, కర్తవ్య పరాయణత, సువ్యవస్థ వీటిని మించిన తత్వం యేదో జీవితంలో దాగియున్నదని, అది కరువైతే జీవితాలు జీవిత సాధనలు కూడా అసంపూర్ణంగా మిగిలిపోతాయని పేర్కొంటూ దానిని గూర్చి విశదంగా తెలుపుమని జిజ్ఞాసువులందరి తరపున ఉద్దాలక మహర్షి కోరటం జరిగింది. సూత్రసంచాలకుడు, బ్రహ్మవేత్తయైన పిప్పలాద మహర్షి మందస్మిత వదనారవిందుడై జిజ్ఞాసువుల నుద్దేశించి ఈ కథలను వినిపించటం జరిగింది.

Beyond Karma: The Hidden Essence of a Meaningful Life

Leave a Comment