If knowledge is not put into practice and remains merely a pleasure to hear, then that knowledge is useless.

జ్ఞానం ఆచరణగా మారక శ్రవణానందంగా మిగిలిపోయే పక్షంలో ఆ జ్ఞానం శుద్ధదండగ.

పిప్పలాద మహర్షి కి నమస్కరించి శ్వేతకేతు ఇలా అన్నాడు. “దేవా! మీరు మానవ స్థాయి గురించి చర్చించేటప్పుడు ఈశ్వరానుగ్రహం, వ్యక్తి సౌభాగ్యం ఈ రెండింటి గూర్చి చర్చించారు. మనిషి సర్వవిధాల స్వతంత్రుడు, పరిపూర్ణుడు అయినపుడు అతనికి ప్రగతి పథంలో ముందుకు పోవడానికి ఎవ్వరి సహాయం, సహకారం అవసరం లేదా? అతని స్వాతంత్ర్యంలో అవరోధం అనేదానికి ఆస్కారమే ఉండదా? అతను ఏది కోరుకుంటే అది సిద్ధించి తీరుతుందంటారా? అతని ఇచ్ఛ, అతని సామర్థ్యం, ఈ రెండే సర్వస్వంగా మనం నిర్ణయించవచ్చునా?” అని శ్వేతుకేతు పిప్పలాద మహర్షిని ప్రశ్నిస్తూ ఆధ్యాత్మజ్ఞాన ప్రకరణాన్నే ఇంకా ముందుకు పెంచాలని ప్రయత్నిస్తున్నాడు.

జ్ఞానాన్ని పరిమితం చేయకుండా, సామాన్య జనులను కూడా ఉపయోగపడేలా చేసి, దాని ద్వారా లాభాన్వితులను గావించాలనేది శ్వేతకేతు యొక్క ఆకాంక్ష.

మనకు ఎటుచూచినా సిద్ధాంతులు, తత్వజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు దర్శనమిస్తూనే ఉన్నారు. సిద్ధాంతాలు చెప్పటం అనేక మందికి తెలుసు. కానీ వాటిని ఆచరణలో చూడాలంటే మాత్రం శూన్యస్థితే కానవస్తుంది. జ్ఞానం ఆచరణగా మారక శ్రవణానందంగా మిగిలిపోయే పక్షంలో ఆ జ్ఞానం శుద్ధదండగ. జ్ఞానానికి సిద్ధాంత పక్షం ఒక అడుగు, వ్యవహారిక పక్షం రెండవ అడుగు. సిద్ధాంతాలు వాటి స్థానంలో అవి ఎంత స్థిరంగా నిలబడిఉన్నా ఆచరణగా మారలేనపుడు ప్రగతి ఆగిపోతుంది.

శ్వేతుకేతుని ప్రశ్నలు పిప్పలాద మహర్షిని అత్యంత ఆనంద భరితుణ్ణి చేశాయి. ఆయన పరవశంతో ఏమన్నాడంటే: “జీవి ఈశ్వరుని అంశ”. ఈశ్వరునితోనే ముడిపడి ఉన్నాడు. శ్రేష్ఠమార్గంలో పయనించటానికి శక్తి నీయుమని వ్యక్తి కోరినపుడు ఈశ్వరుడు ఉదారంగానే ఇస్తున్నాడు. ఈ విధమైన సహాయాలను అర్థించి అనేకమంది భక్తులు తమ జీవితాలను చరితార్థం చేసుకొన్నారు.

ఎన్నికలో స్వాతంత్ర్యం, ఔచిత్యం, అనౌచిత్యం యొక్క ఎంపిక మొదలైన దండన శిక్షణల రూపంలో తిరిగి అతన్ని సన్మార్గంలోకి తీసుకునిరావటం, సన్మార్గంలోనే పయనించేటప్పుడు అడుగకపోయినా అపారమైన అనుగ్రహాన్ని అందచేయటం మొదలైన పనులు తన ఆధీనంలో ఉంచుకొన్నాడు. ఈ విధంగా జీవ-బ్రహ్మల ఏకత్వ మనేది కేవలం మానవునకు మాత్రమే లభించిన శ్రేష్ఠమైన అలభ్య అవకాశం” అంటూ మహర్షి కథను వినిపించారు.

Leave a Comment