True Devotion: A Life of Selfless Service.

ఒకసారి భోజమహారాజు దర్భారుకి సోమదత్తుడనే బ్రాహ్మణుడు వచ్చి, ఉజ్జయినీ నగరంలో భాగవత కథలు వినిపించడానికి ఆజ్ఞ ఈయవలసిందిగా కోరతాడు. భోజమహారాజు నిరాకరిస్తూ కొంతకాలం భాగవతాన్ని పఠించి ఆ తర్వాత రమ్మంటాడు.

చెప్పినట్టు చేసి రెండవసారి వచ్చినా కూడా నిరాకరిస్తూ భాగవతాన్ని బాగా అర్థంచేసికొని కంఠస్తం చేసి రమ్మని పంపించివేస్తాడు. తరువాత ఎంత కాలానికి బ్రాహ్మణుడు రాకపోయే సరికి భోజరాజు ఆయనను వెదకడం ప్రారంభిస్తాడు. ఒక చెట్టు క్రింద భాగవత పారవశ్యంతో ధనం మీదగానీ, కీర్తిమీద గానీ కోరికలేని స్థితిలో బ్రాహ్మణుడొకనాడు దర్శనమిస్తాడు.

భోజరాజు ఆయనకు నమస్కరించి మీ భాగవత కథలు ఫలించి సమాజంపై ప్రభావాన్ని చూపటానికి సరియైన సమయము ఇదేనంటూ సగౌరవంగా బ్రాహ్మణుని ఉజ్జయినీకి తీసుకొని వెళతాడు. రాజు ఇచ్చిన పారీతోషికాలన్నింటినీ బ్రాహ్మణుడు దారిలోనే పేదలకు పంచివేస్తాడు.

భక్తుడు తన కోరికలను త్యాగం చేస్తే భగవంతుడు స్వయంగా భక్తునిలో కలసిపోతాడు. దేవుడు కొలవైయున్న ఆ మందిరానికి వేరే కోరికలు, అవసరాలు అంటూ ఏమి ఉండవు.

సాధువుగా మారటం భక్తుని రెండవ విశేషం. మాయనుండి దూరంగా తొలగి తనను తాను జన కల్యాణానికి వినియోగించుకోగల వాడు సాధువే. కేశవానంద్ అనే ఆయన అసలైన సాధు ధర్మాన్ని నిర్వర్తిస్తూ

రాజాస్థాన్ లో విద్యాపీఠాలు నిర్మించారు. జన సహకారంతో ఆయన మహిళల స్వావలంబనకు, అక్షరాస్యతకు నడిపిన ఉద్యమాలు ప్రతి పరమార్థ పరాయణుడైన వ్యక్తికి కూడా మార్గదర్శకం అయినవి.

ఆదిశంకరాచార్య సంస్కృతిని రక్షించటానికి భజగోవింద శ్లోకాలను గొంతెత్తి పాడుతూ, భారతదేశమంతా పరిభ్రమించాడు. ఈ శ్లోకాలలో ధర్మానికి సంబంధించిన అనేక మూల విశ్వాసాలు ఖండించబడ్డాయి. అంతేకాక, ఈ విధంగా శంకరాచార్య పరిభ్రమిస్తూ ధనవంతులను మానవకళ్యాణానికి తమ ఐశ్వర్య రాశులను వినియోగించేందుకు వివశుల్ని చేసి పూర్తి సాఫల్యాన్ని సాధించాడు. తన వ్యాధుల్ని, బాధల్ని కూడా లెక్కచేయక అనవరతం పరహితార్థం కోసం పాటుపడే ఇటువంటి వారంతా సదా పూజనీయులేకదా!

మహాత్ముడైన ఆనందస్వామి ఆర్యసమాజ వేదికను అలంబనగా చేసుకొని సమాజ సంస్కరణ, పరమార్థం, ఈశ్వర భక్తిని గురించి సందేశాత్మకమైన నినాదాలిస్తూ తన సమస్త సంపదను సమాజానికే అర్పించిన మహనీయుడు. మహాత్ములు అంటే అసలైన నిర్వచనం ఇటువంటివారే. వీరు చిరంజీవులై జీవితాంతం సమస్త ధార్మిక సాంప్రదాయాల పట్ల ప్రగాఢమైన భక్తి శ్రద్ధలను కలిగి ఉండగల్గడానికి మూల కారణం వీరి అంతరంగంలోని పరమార్థ పరాయణతే తప్ప, మరేవిధమైన సౌకర్యాలు, సదుపాయాలు కాదు.

ఉదార భావనతో కూడిన భక్తి యొక్క అరుణోదయ కాంతి కిరణాలు “సహకారం” అనే ప్రవృత్తి ద్వారా మాత్రమే ప్రసరించబడతాయి. నవ్వుతూ నవ్వించగల పరిసరితులు నలుదిక్కులా సృష్టిస్తూ, ఉన్నదానిని ప్రేమతో పంచుకొని తింటూ, సహకారంతో కలసిమెలసి జీవించడం వల్లనే ప్రగతి పథం ప్రాశస్త్యం పొందగలుగుతుంది. సంఘీభావాన్ని మించిన గొప్ప సామర్థ్యం మరేదీ లేదు.

దైనందిన జీవితంలో భక్తి భావనలు మేళవించినప్పుడు వ్యక్తుల ద్వారా నలుదిక్కులా వెదజల్లబడేవి సహకార వీచికలు. ఈ సమస్త సృష్టి చక్రం పరమార్థం మీదనే తిరుగాడుతూ ఉంది. ఎత్తున విశాల వృక్షంగా రూపు ధరించాలంటే తనను తాను పూర్తిగా ధూళితో కప్పి వేసుకోవాలి. తల్లి పుత్రోదయాన్ని ధరించాలంటే తన శరీరంలోని రక్త మాంసాలను సంతాన నిర్మాణానికి సమర్పించి, ప్రసవ వేదనను అనుభవించినప్పుడే సాధ్యమవుతుంది.

నదులుగాని, వృక్షాలుగాని, భూమిగానీ, ఆకాశంగానీ సృష్టిలో వేటిని ఉదాహరణగా తీసుకున్నప్పటికీ, అన్నీ కూడా అంతులేని కష్టాన్ని సహిస్తూ పరమార్థం కోసం పాటుపడుతున్నవే. స్వార్థం, ఏకాకితనం అనేవి సమాప్తమైనపుడు మాత్రమే లోనున్న అంధకారం పలాయనం చిత్తగించి, అంతరంగం తేజోవంతమవుతుంది.

True Devotion: A Life of Selfless Service.

Leave a Comment