The Power of the Supreme Soul is Superior to the Power of the Self.

ఆత్మ శక్తి కంటే పరమాత్మ శక్తి శ్రేష్ఠమైనది

మహాభారత యుధ్ధం ముగిశాక మహర్షి జరత్కారునితో శిష్యుడు గురుదేవా! యుద్ధ విద్యలో కర్ణుడు [Karna] అర్జునుని [Arjuna] కంటె శ్రేష్టుడు, గొప్పదాత, ఆత్మబల సంపన్నుడు. అయినా అర్జునుని చేతుల్లో ఎందుకు ఓడిపోయాడని ప్రశ్నిస్తాడు. గురువు శిష్యుని ప్రశ్న విని, నాయనా! కృష్ణుడు [Krishna] నారాయణుడు. [Arjuna] అర్జునుడు నరుడు. ఈ నరనారాయణుల కలయిక మాత్రమే అసుర నాశనం చేయగలదు. అర్జునుని కంటే కర్ణుడు అనేక విధాల శ్రేష్టుడే అయినా ఆత్మ శక్తి కంటే పరమాత్మ శక్తి శ్రేష్ఠమైనదని అంగీకరించక, కేవలం తన శక్తి పురుషార్థమే సర్వస్వంగా భావించి నారాయణ శక్తిని ఉపేక్షిస్తాడు. ఇదే అతని పరిజయానికి కారణమైందని గురువు శిష్యునికి తెలియచేస్తాడు.

ఒకొక్కసారి మనిషికి తన సామర్ధ్యం పట్ల చాలా గర్వం కల్గుతూ ఉంటుంది. అంతవరకూ అయినా పరవాలేదు. కానీ తనకు మించిన శక్తి [Energy] ఒకటి ఉన్నదనే విషయాన్ని విస్మరించి విర్రవీగుతూ ఉంటాడు. మానవులకే కాకుండా ఇటువంటి స్థితి దేవతలకి కూడా ఒకొక్కసారి ఏర్పడుతూ ఉంటుంది. దీనిని దైవం ఏ మాత్రం ఉపేక్షించక తప్పనిసరిగా వారికి గర్వభంగం చేస్తూ ఉంటాడు.

దేవాసుర సంగ్రామానికి బ్రహ్మగారు ప్రణాళిక వేస్తాడు. విష్ణువు అన్నీ సంఘటిత పరుస్తాడు. దధీచి మహర్షి వజ్రాయుధానికి తన వెన్నెముక ఇస్తాడు. ఈ ప్రణాళిక, ఈ సంఘటిత శక్తి, దధీచి యొక్క త్యాగం ఇవన్నీ కలిసి వృత్రాసురుని వధించి విజయాన్ని సిద్ధింపచేశాయి. కానీ ఇంద్రుడు [Indra], అహంకారంతో సహాయం చేసిన వారందరనూ ధికరించి కృతఘ్నుడై కీర్తి మొత్తం తనకే ఆపాదించుకోవాలని చూస్తాడు. తాను లేకుంటే వృత్రాసురవధ అసుభవం అంటూ భుజాలు చరుస్తాడు. కృతఘ్నతతో కూడిన అహంకారం అతి నీచమైనది. దానిని నశింపచేయటానికి భగవంతుడు మాయ పన్ని ఒక యక్షుని రూపం ధరించి దేవతల ముందుకు వచ్చి నిలబడతాడు.

ఒక చిన్న గడ్డి పోచను వారి ముందుంచి మీలో ఎవరైనాసరే మీ శక్తితో దీనిని కదిలించమని అడుగుతాడు. ఇంద్రునితో సహా అందరు దేవతలు ఒకొక్కరుగా వచ్చి ప్రయత్నించి విఫలమవుతారు. భగవానుడు [God] నిజస్వరూపాన్ని వారికి చూపి చూసారా! మీరు మీ శక్తి తో గడ్డిపోచనుకూడా కదిలించలేకపోయారు. మీకు మించిన శక్తి ఒకటున్నదనీ, ఆ శక్తి కాదంటే మీరు మీ శక్తి తో చిన్న గడ్డిపోచనుకూడా కదిలించలేరని గుర్తుంచుకోండి. తమ శక్తే సర్వస్వంగా భావించటం వల్లనే అసురసంతతి నాశనమైంది అని హెచ్చరిస్తాడు.

The Power of the Supreme Soul is Superior to the Power of the Self.

ఈ కధ [Story] మానవులకు కూడా సంబంధించినది. దైవకృప లభించే వరకు మానవుడు పూజలు, అర్చనలు, సాధనలు పట్టుకొని ప్రాకులాడుతాడు. ఆత్మ శక్తితోనే దైవకృపను పొందగలిగాననే విషయాన్ని విస్మరించి పరిస్థితులు కాస్త ఆశాజనకంగా ఆనందంగా ఉండగానే అంతా తన ప్రయోజకత్వమేనని, ఈశ్వర శక్తిని విస్మరించి విర్రవీగుతాడు. ఆత్మ శక్తిని మరిచి ఈశ్వరకృపకు ప్రాకులాడటంగానీ, ఆత్మ శక్తే సర్వస్వంగా భావించి విర్రవీగటంగానీ ఈ రెండు శ్రేయస్కరం కాదు. ఈ రెండు అన్యోన్యాశ్రితమైనవి అని పిప్పలాద మహర్షి జిజ్ఞాసువులకు వినిపించారు.

ఆత్మశక్తి ఈశ్వరశక్తుల సమన్వయం ఎప్పుడు సాధ్యమవుతుందంటే వ్యక్తి లో శ్రధ్ధ ప్రజ్ఞ నిష్ఠలు జాగృతం కావాలి.

శ్రద్ధ [Attention]: రామకృష్ణ పరమహంసలోని శ్రద్ధ కాళీమాతను ఆయన నైవేద్యమిడిన పదార్ధం తినేటందుకు వివశురాలిని చేస్తుంది.

భక్తి [Bhakti]: మీరా లోని శ్రద్ధ వల్ల ఆమె పూజించే సాలిగగ్రామం నడచివచ్చి ఆమెతో ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది. నిరంతరం ఆమె వెంట ఉండి ఆపదలనుండి ఆమెను రక్షిస్తుంది.

ప్రజ్ఞ [Pragya] : అపరిగ్రహాన్ని స్వీకరించిన బ్రాహ్మణోచిత జీవితాన్ని జీవిస్తూ తమకోసం అతి స్వల్పంగాను, సమాజంకోసం సర్వస్వాన్ని అర్పించగల స్థితి గాంధీ, టాండన్, బుద్దుడు మొదలైన ప్రజ్ఞ వికసించినవారికే లభిస్తుంది. ఇటువంటి భూసురులగా మారాలంటే అందరిలో ప్రజ్ఞ మేల్కొనాలి.

నిష్ఠ [Loyalty]: ఈ నిష్ఠ సత్కర్మాచరణ చేసేవారిలో తిష్ఠవేసి కూర్చుంటుంది. వేషబాషలు, వృత్తి సంపద జ్ఞానం వీటివేటివల్ల వ్యక్తి సాధువు కాలేడు. కేవలం సత్కర్మాచరణ మాత్రమే వ్యక్తిని సాధువుగా మారుస్తుంది. ఉదారహృదయుడైన సాధువుకు స్వపర భేదముండదు. నిష్ఠకు మరోపేరు సాధుత్వం.

మానవుడు ఏదైనా కోరదలిస్తే తనకంటే శ్రేష్ఠుడు మూలపురుషుడు సర్వజ్ఞుడు అయిన పరమాత్మనే కోరుకోవాలి. సర్వం ఇవ్వగల ఆ పరమాత్మతో ఉపాసన, సాధన, ఆరాధనల ద్వారా ఘనిష్ఠమైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఆత్మకు పరమాత్మకు మధ్య సరాసరి సంబంధం ఉన్నది. మధ్య దారులను వెదకి తమవంటి వారిని, తమకంటే తక్కువ స్థితిలో ఉన్నవారిని ఆశ్రయించుట, ఆపేక్షించుట అజ్ఞానానికి తాత్కాణమేగానీ గోరంత ఫలితం దక్కదు.

Leave a Comment