Why Yudhishthira Was Called Dharmaraja – The Hidden Power of Truth and Dharma

యుధిష్టిరునికి “ధర్మరాజు” పేరెలా వచ్చిందని ఒక యాదవుడు శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నిస్తాడు.

మహాభారతయుద్ధం జరుగుతూ ఉండగా ప్రతిరాత్రీ యుధిష్ఠిరుడు మారువేషం ధరించి ఎక్కడికో వెళుతూ ఉండేవాడు. ఎందుకో, ఏమిటో రహస్యం తెల్సుకోవాలనే కుతూహలంతో ఒకరాత్రి యుధిష్ఠిరుని తమ్ములు అనుసరిస్తారు. అక్కడ యుద్ధభూమిలో యుద్ధిష్ఠరుడు గాయపడిన వారికి సేవలు చేస్తున్న దృశ్యం చూచి వారు ఆశ్చర్యచకితులవుతారు. ఇంత ఆదరంగా ప్రేమతో సేవలు చేయటానికి మారువేషంలో రావల్సిన అవసరం ఏముంది అన్న? అని సోదరులు యుధిష్ఠరుని ప్రశ్నిస్తారు.

ప్రసన్న వదనుడైన యుధిష్ఠరుడు కరుణ నిండిన కన్నులతో సోదరులవంకచూచి, “సోదరులారా! నేను సేవచేసేవారిలో ఎక్కువ భాగం కౌరవ పక్షానికి చెందినవారు ఉంటున్నారు. నేను సహజ వేషధారుడిగా వెళ్లినట్లయితే వారు నాకు మనసువిప్పి బాధను చెప్పుకోరు. ఆ విధంగా వారికి సేవచేసే భాగ్యం నుండి వంచించబడతాను. మారువేషంలో వెళితే ఈ ఇబ్బంది లేకుండా ఉంటుంది ” అని విషయాన్ని వివరిస్తాడు. శ్రీకృష్ణుడు యాదవులకు ఈ విషయాన్ని వినిపించి ఓ దయామయుడా! ధర్మం పరమార్థం అన్యోన్యాశ్రితమైనవి. కాబట్టి యుధిష్ఠిరుని ధర్మరాజు అని పిలవటం, ధర్మనిష్ఠలో అతనికి అగ్రస్థానాన్ని ప్రసాదించటం జరిగింది ” అని తెలియజేస్తాడు.

అస్వస్థత కారణంగా బుద్ధుడు ఏకాంతంలో గడుపుతున్న రోజులవి. ఒకరోజు సుభద్రుడు అనే శ్రేష్ఠివచ్చి, భావి పరిస్థితులగురించి బుద్ధునితో తాను చాలా ముఖ్యమైన చర్చ జరపాలనీ, ఒక్కసారి లోనికి పోనీయమని ఆనందుని కోరుతాడు. శిష్యుడైన ఆనందుడు నిరాకరిస్తాడు. ఎట్టి పరిస్థితులలోను గురువుకు శ్రమకలుగరాదని చెప్పి నిరాకరిస్తాడు.

ఈ వార్తాలాపాలు బుద్ధునికి వినిపిస్తాయి. స్వయంగా తానే లేచివచ్చి సుభద్రుని లోనికి ఆహ్వనిస్తూ, ఆనందుని వంక తిరిగి “నాయనా” లోక మంగళకరమైన కార్యక్రమాల కోసం సంప్రదించవచ్చిన నా అస్వస్థత కారణంగా నేను మాట్లాడే అవకాశం ఇవ్వని పక్షంలో నేను ఏం బుద్ధత్వం సాధించినట్లు? కాబట్టి నా అనారోగ్యం కారణంగా ఇటువంటి వ్యక్తులెవరినీ నిరుత్సాహ పరచకండి.

“పనిచేసే వ్యక్తులకు ప్రేరణ నీయటం, ప్రోత్సహించటం మార్గదర్శకుల ప్రథమ కర్తవ్యం” అని తెలియజేస్తాడు. బుద్ధునితో సుభద్రుని ఆ చివరి కలయిక అతని జీవితాన్ని సమాజ కల్యాణం కోసం సర్వవిధాల సమర్పించుకొనేలా చేసింది. బౌద్ధధర్మ ప్రచారానికై అతను చేసిన కృషి చరిత్రలో నిలచిపోయింది.

ఓ మహాభాగా! ఆత్మశక్తి పరిమితమైనది. పరమాత్మ శక్తి అనంతమైనది. ఈ రెండు శక్తులు ప్రసన్నం కావాలి. పురుషార్థం ద్వారా సాధన చేసినపుడు మాత్రమే పరమాత్మ అనుగ్రహానికి అర్హత లభిస్తుంది. అడుక్కోవటం, కోర్కెలు కోరటం “నీకు ఇది ఇస్తాను నాకు ఇది ఇవ్వమని” లంచాలు చూపటం వంటి నీచకృత్యాలు జోలుకిపోకుండా పురుషార్థ సాధనను పూర్తిచేసి పాత్రత సంపాదించాలి.

భక్తునివంటి శ్రద్ధ, బ్రాహ్మణుని వంటి ప్రజ్ఞ, సాధువువంటి పరమార్థనిష్ఠ ఈ మూడు ఆర్జిస్తేచాలు మిగిలిన సమస్త శక్తులు సంపదలు వీరికి హస్తగత మవుతాయి.

Takeaway:

నిజమైన మార్గదర్శకుడు తన వ్యక్తిగత పరిస్థితులను పక్కన పెట్టి, సమాజ మేలుకోసం పనిచేసే వారికి ప్రేరణ, ప్రోత్సాహం, మార్గదర్శనం అందించాలి. శరీరానికి పరిమితులు ఉన్నా, ఆత్మశక్తి మరియు పరమాత్మ అనుగ్రహంతో మనిషి గొప్ప కార్యాలను సాధించగలడు. కోరికలు కోరడం కంటే పురుషార్థం, శ్రద్ధ, ప్రజ్ఞ, పరమార్థ నిష్ఠలను పెంపొందించుకోవడం ద్వారా మనిషి దైవ అనుగ్రహానికి అర్హుడవుతాడు. నిజమైన భక్తి అంటే అడగడం కాదు — తన శక్తిని సమాజ శ్రేయస్సుకు అంకితం చేయడం.

Why Yudhishthira Was Called Dharmaraja - The Hidden Power of Truth and Dharma

Leave a Comment