When we recognize the power of the spirit and the power of God within us, we can destroy the illusions within us.

మనలోని ఆత్మశక్తిని, ఈశ్వరుని సామర్ధ్యాన్ని గుర్తించినపుడు మనలోని మాయా మోహాలను నశింపచేసుకోగల్గుతాం.

తక్షశిలపై శత్రురాజులు హఠాత్తుగా దండెత్తుతారు. సేనాధిపతి భయపడి రాజుని శత్రువుతో సంధి చేసుకోమంటాడు. ఆ రాజ్యంలోని ఒక సిద్ధ పురుషుడు పిరికితనాన్ని బోధించే సేనాధిపతిని పదవినుంచి తొలగించమని, సేనకి నాయకత్వం తాను వహిస్తానని చెప్పి, శత్రురాజుని ఎదుర్కోవటానికి సైన్యాన్ని సిద్ధం చేస్తాడు.

మార్గమధ్యంలో సిద్ధపురుషుడు సైన్యాన్ని ఆపి, రాజుని ఎదురుగా ఉన్న దైవ మందిరంలోనికి వెళ్లి నమస్కరించి, విజయం కల్గే పక్షంలో చేతిలోని స్వర్ణముద్ర పైకి ఎగరవేసినపుడు బొమ్మ పడాలని కోరుకోమంటాడు. అలాగే జరుగుతుంది. రాజుకి విజయం కూడా లభించింది.

ఈ విజయానికి కారణం మందిరంలోని దేవీ మహత్యమేనా? అని రాజు సిద్ధపురుషుని అడుగుతాడు. సిద్ధ పురుషుడు చిరునవ్వు నవ్వి స్వర్ణముద్రను చూపిస్తాడు. ముద్రపైన రెండు వైపులా ఒకే బొమ్మ గుర్తు ఉంటుంది. రాజు ఆశ్చర్యపోతాడు. ” నీ విజయానికి కారణం నీ ఆత్మ విశ్వాసమేనయ్యా! నిద్రించే ఆత్మ విశ్వాసాన్ని మేలుకొల్పటంతో విజయలక్ష్మి నిన్ను వరించింది. అని సిద్ధ పురుషుడు రాజుకి విషయాన్ని వివరించి సాగిపోతాడు.

బుద్ధుడికి అప్పటికింకా ఆత్మబోధ కలగలేదు. మనస్సు అస్థిరంగా ఉండేది. రాజ్యసౌధాలలో హాయిగా జీవించినా బాగుండేది. “తిరిగి వెళ్ళిపోదామా” అని అశాంతితో బాధపడేవాడు. కష్టతరమైన అనేక సాధనలు చేస్తూనే ఉండేవాడు. ఇలాంటి సమయంలో ఒక పురుగు తాను కూర్చున్న చెట్టు ఎక్కుతూ పడుతూ ప్రయాసపడుతూ కనిపించింది. అయినా దాని ప్రయత్నం మానుకోదు. 16 వ సారి దాని ప్రయత్నం ఫలిస్తుంది. ఆ దృశ్యం బుద్ధుడికి ప్రేరణ నిస్తుంది. ఆయనలోని ఆత్మవిశ్వాసం మేల్కొంటుంది. అప్పటి నుండి ఆత్మ సాధనలో గాఢంగా లీనమవుతాడు. చివరకు లక్ష్యాన్ని చేరుకుని, ఆ సామర్థ్యాన్నే సత్పవృత్తుల సంవర్థనికి వినియోగించి “విచార క్రాంతి” ని తీసుకుని రాగలిగాడు.

మేఘనాధుడు శక్తి బాణాన్ని ప్రయోగించినపుడు లక్ష్మణుడు మూర్చపోతాడు. అదే లక్ష్మణుడు రెండవసారి మేఘనాధుని మాయకు ఎట్టెదుట నిలబడినా ఆ శక్తి బాణాలు అతడిని ఏమీ చేయలేక పోతాయి. ఈసారి లక్ష్మణునిలో అన్నగారి ప్రేరణాత్మకమైన వాక్కులు ఆత్మశక్తిని జాగృతం చేశాయి. ఆత్మ విశ్వాసానికి, తపోశక్తి ద్వారా తాను ఆర్జించిన సామర్థ్యాన్ని జోడించి లక్ష్మణుడు ఏ విధంగా రాక్షస మాయను; రాక్షసులను నాశనం చేశాడో అదే విధంగా మనం కూడా మనలోని ఆత్మశక్తిని, ఈశ్వరుని సామర్థ్యాన్ని గుర్తించినవాడు మనలోని మాయా మోహాలను నశింపచేసుకో గల్గుతాం.

ఆత్మవిశ్వాసం కలవారికే ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. ఈశ్వరానుగ్రహం ఒకే ఒక వెల మీద మనకు లభిస్తుంది. అది ఏమంటే మన ప్రామాణికతను మనం ఋజువు చేసుకోగల్గాలి. ప్రామాణికత అంటే ఈశ్వరాను శాసనానికి తలవంచటం. ఆయన వ్యవస్థ పట్ల విశ్వాసం ఉంచుకోవటం. దైవం యొక్క ఆదేశాన్ని వాదన లేకుండా అంగీకరించ గలగాలి. ఈ సత్యాన్ని రామాయణ రచయిత ఏమన్నారంటే “

మసేవక్ మమ ప్రియతమ్ సోయీ!

మమ అనుశాసన్ మానహి జోయీ!”

Leave a Comment