Worship Is Not for God… It Is for Our Spiritual Growth.

ఈశ్వరునికి కానుకలు, స్తోత్రాలు, పూజలు ఏ మాత్రం అవసరంలేదు. పాత్రత వికసింప చేసికోటానికి అవి వ్యక్తి కోసం నిర్దేశింపబడిన ఆధారాలు మాత్రమే.

నరకయాతనలను అనుభవించే పూర్వీకులను తరింప చేయటానికి భగీరథునికి గంగను భూమిపైకి గొనిరావటం తప్పని సరియైంది. ఏదో విధంగా గంగను భూమిపైకి తెస్తే పితృదేవతలకు సద్గతి లభించటమేగాక అనేకమైన ప్రాణుల దాహాన్ని కూడా తీర్చవచ్చునని గ్రహించిన తక్షణమే భగీరథుడు భవనాలను, రాజ్యభోగాలను వదిలి తపోవనాలకి బయలుదేరాడు. ప్రసన్నురాలైన గంగ ని ఆ పరమ శివుడు భూమి మీదకి ప్రవహింప చేశాడు. నిజం చెప్పాలంటే భగీరథుని శక్తి చాలా సాధారణమైనది. కానీ అతనిలో పరమార్థం, లోకమంగళం – ఈ భావనలు ఈశ్వరశక్తిని, పరమశివుని సహకారాన్ని అందజేశాయి.

ఉత్కృష్ట ఆదర్శవాదం యొక్క సమచ్చయమే పరమాత్మ, అనంతుడు, అగోచరుడు అయిన ఆయన అనుగ్రహంతోనే వైభవ వరదానాలు భక్తజనులకు హస్తగతమౌతున్నాయి. ఈయనను సమగ్రంగా తెలిసికౌగల్గటమనేది ఎవ్వరికీ శక్యం కానిది. కానీ పరమాత్మ శక్తి వ్యక్తితో ముడిపెట్టబడి ఉంది. ఇది పరమాత్మ యొక్క ఒక రూపమైతే రెండవ రూపం నాల్గు దిక్కుల దిగ్దిగంతాల వరకు వ్యాపించియున్న విరాట్ స్వరూపం. మొదటి దానిని పరమాత్మయని రెండవ దాన్ని పరబ్రహ్మయని అంటారు.

ఒక వ్యక్తి ఒక గుడ్డివారి సమూహంతో ఎదురుగానున్న ఏనుగును తాకి ఏనుగెలా ఉంటుందో చెప్పుమని ప్రశ్నించాడు. తోక పట్టుకొన్న వ్యక్తి ఏనుగు త్రాడులా ఉంటుందని, చెవి పట్టుకొన్న వ్యక్తి చేటలా ఉంటుందని, కాలుపట్టుకొన్న వ్యక్తి స్తంభములా ఉంటుందని ఒక్కొక్క విధంగా తెలియజేస్తారు.

ఇదే విధంగా పరబ్రహ్మ యొక్క అంశను మనం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాత్రమే చూడగల్గుతున్నాము. ఆ కాస్త అనుభవాన్నే అనేక విధాలుగా చెబుతూ ఉంటాము. అందుకే మూర్ఖులు అనంతుడైన ఈ విరాట్ స్వరూపుని చూచి నేతి… నేతి అన్నారు. ఇంక పరమాత్మ యొక్క రెండవ రూపం మానవుని కర్తృత్వం, వ్యక్తిత్వ వికాసం, పూర్ణత్వం, ముక్తి-వీటికి సంబందించినది.

మానవుని సహజ వికాసం పరమాత్మ శక్తి రూపంగానే జరుగుతుంది. అతనిలోని శ్రేష్ఠత యొక్క అంశ ఎంతగా పెరుగుతుంటే అతను పరమాత్మునికి అంతగా దగ్గరవుతూ ఉంటాడు. మానవుడు తనను మానవుడుగా భావించినంతకాలం ఆ స్థాయికి తగిన కర్మలే చేస్తూ ఉంటాడు. అలాకాక తనను తాను పరమాత్మ యొక్క అంశగా గుర్తించి తనలో దైవశక్తి పనిచేస్తున్న అనుభుతిని పొందిన తక్షణం అతనితో దృఢంగా బంధించబడతాడు.

సుధాముడు ఒక గురుకులానికి ఒక కులపతి మాత్రమే. సాధారణ అధ్యాపకుడుగా జీవిస్తూ శ్రీకృష్ణుడు తన సహాధ్యాయి కావటంవలన సహజ మిత్రత్వం ఇద్దరి మధ్య ఉండేది. కానీ సుధాముడు మహాత్నుడెప్పుడు కాగలిగాడంటే తనను తను పూర్తిగా సమర్పణ గావించుకొని ద్వారక వచ్చినప్పుడు భగవానుడతనిపై తన పూర్తి అనుగ్రహాన్ని వర్షింపజేస్తాడు. సమాన ధర్మాలుగల ధాతువులు అయినపుడే పరస్పరం ఆకర్షించబడి ఒకటవుతాయి. ఇలాగే భక్త కబీరు భగవంతునితో గాఢమైన బంధం యేర్పడినపుడు ఎలాంటి స్థితి కలుగుతుందో వినిపిస్తాడు.

అసురులైన బంధుజనుల పట్ల మోహాన్ని వదిలి, అవినీతిని ఎదిరించి ఆదర్శాలను మార్గం వెంట పయనించి వచ్చి మొట్టమొదటిసారిగా రాముణ్ణి కలిసిన విభీషణునితో రాముడు ‘లంకేశ్వరా!’ అని సంబోధించి మాట్లాడటం జరిగింది. రావణ సంహారమైనా జరుగకుండా విభీషణున్ని లంకేశ్వరా అని సంబోధించటంలో రాముని అంతర్యం ఏమంటే, దైవానికి తనను తాను సమర్పించుకొన్న ప్రతివ్యక్తినీ భగవంతుడు ఉన్నత శిఖరాలపై అధిష్ఠింప చేస్తాడని అర్థమవుతుంది.

ఆదర్శాలకు ప్రతిరూపమే పరమాత్మ శక్తి, తనకు ప్రతిరూపంగానున్న వారిపట్లే భగవానుడు ప్రసన్నుడౌతాడు. ఈ అనుకూలత, అనురూపతలనే “పాత్రత” అని అంటారు. ఈశ్వరునికి కానుకలు, స్తోత్రాలు, పూజలు ఏ మాత్రం అవసరంలేదు. పాత్రత వికసింప చేసికోటానికి అవి వ్యక్తి కోసం నిర్దేశింపబడిన ఆధారాలు మాత్రమే. ఆత్మశక్తిని పరమాత్మ శక్తితో జోడించి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొనే కార్యక్రమాన్ని ఆరంభించటం ఏదైతే ఉన్నదో దానినే పాత్రతగా పేర్కొనడం జరిగింది. భక్తిలో గుణ కర్మ స్వభావాల ఉత్కృష్టత, ఆదర్శాలపట్ల సమర్పణ, భగవంతుని అనుగ్రహం ఈ మూడు ధారలు అనవరతము కలిసి ప్రవహిస్తూ ఉంటాయి.

Leave a Comment