కర్మ మరియు జీవితం అనేవి రెండు పరస్పర ఆధారిత విషయాలు. కర్మ స్థాయిని బట్టి జీవిత విజయాన్ని స్పష్టంగా అంచనా వేయవచ్చు.
ఒక వ్యక్తి సాంసారిక పద ప్రతిష్ఠల నాశించక సమయాన్ని శక్తిని సాంసారిక సుఖాలకు వెచ్చించక జాగ్రత్తగా జీవించి మరణిస్తాడు. అయినా అతనికి కోరుకున్న ముక్తి లభించదు. మరికాస్త ఉన్నత కులంలో పుట్టమని యమధర్మరాజు ఆదేశిస్తాడు. తన త్యాగానికి ప్రతిఫలంగా సద్గతి ప్రసాదించక పునర్జన్మను ప్రసాదించటానికి కారణం ఏమిటని ఆయన యమధర్మరాజుని ప్రశ్నిస్తాడు.
యమధర్మరాజు ఆయనతో అయ్యా! నీవు అపవ్యయం చేయకుండా అరికట్టిన జీవిత కాలాన్ని ఈశ్వరుని ఉద్దేశ్యాన్ని నెరవేర్చటానికి ఉపయోగించినట్లైతే సద్గతి పొందగల్గేవాడినవి. అపవ్యయాన్ని అరికట్టేవేగాని, అరికట్టిన దానిని సద్వినియోగం చేయనపుడు సద్గతి ఎలా లభిస్తుంది? అని అడుగుతాడు. వ్యక్తి, తన పొరపాటును గుర్తించి యమధర్మరాజు వద్ద సెలవు తీసుకుంటాడు. శ్రేష్ఠకులంలో అనుకూల పరిస్థితులలో జన్నించి త్యాగంతో పాటు త్యాగం చేసిన వాటిని సద్వనియోగం చేయటం తప్పనిసరిగా గుర్తిస్తాడు.
లక్ష్యం యొక్క నిర్థారణ సరియైనది అయితే ఓటమి కూడా సాఫల్యంగ మారుతుంది. సంస్కృత విద్యలో అపారమైన ప్రతిభగల వరదరాజుల వారు చిన్నతనంలో స్కూలల్లో పరమ మూర్ఖుడైన విద్యార్థి. ఎంత చదివినా గుర్తుండక అవమానంతో ఒక రాత్రి ఇల్లు వదలి పారిపోయి ఒక గొడ్లశాలలో పడుకుంటాడు. అక్కడ ఒక రెక్కలు తెగిన పురుగు గోడ ఎక్కటానికి ప్రయత్నిస్తూ 20 మార్లు క్రిందపడి 21 వసారి గోడ ఎక్కగల్గటం అతడు గుర్తిస్తాడు. ఈ చిన్న సంఘటన ఇతనిలో క్రొత్త ప్రేరణను కల్గిస్తుంది. ఇంటికి వచ్చి విద్యాధ్యయనంలో లీనమై అపారమైన పాండిత్యాన్నో సంపాదిస్తాడు.
ఒక ధనవంతుడైన సేఠ్ పరమ పిసినారి. తను సంపాదించింది ఎవరైనా అపహరిస్తారనే భయంతో అడవిలో పెద్ద గుంట తీసి అందులో దాచిపెట్టి ప్రతి రోజూ వెళ్లి దూరంగా నిలబడి ఆ ప్రదేశాన్ని చూచి తృప్తిపడి తిరిగి వస్తూ ఉండేవాడు. ఒకనాడు కొందరు దొంగలు ఇది గమనించి ఆ ధనాన్ని అపహరిస్తారు. యధాప్రకారం మర్నాడు సేఠ్ ఆప్రదేశాన్ని చూడటానికి వెళ్లి అది అపహరించబడటం గమనించి గుండె బాదుకొంటూ రోదించసాగాడు. ఈ ఏడుపు విని ఒక మహాత్ముడు నాయనా! ఆ డబ్బు నీకుగానీ, నీ కుటుంబానికి గానీ, సమాజానికి గానీ ఎలాగా ఉపయోగపడేది కాదుగదా! అటువంటప్పుడు వస్తువు ఎక్కడున్నా ఒక్కటే కదా! విచారం దేనికని ఊరడిస్తాడు.
మాళవీయజీ శిరస్సు పంకిస్తూ, అయ్యా! మీ కుమార్తె వివాహానికి రావటానికి ఒక షరతు పెడుతున్నాను. “మీరు వివాహానికి ఖర్చు పెట్టే లక్షల ధనాన్ని వధూవరుల పేరున జమ చేయాలి. దానితో వారు శ్రమించి వారి కాళ్ళమీద వారు నిలబడగల ప్రయోజకులు గాగల్గుతారు. అంతేకాక మీ కాబోయే అల్లునికి ఇస్తున్న కట్నం మధ్యలో ఆగిపోయిన బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ నిర్మాణానికి డొనేషన్ గా ఇవ్వండి. మీ అల్లుడు నా విద్యార్థి కావటం వల్ల నేను అతని ధనాన్ని గురువుగా లోక మంగళం కోసం అర్థిస్తున్నాను అని తెలియజేస్తాడు.
ఈ మహాత్ముని వాక్కలు ధనవంతుని హృదయాన్ని కదిలించాయి. అంగీకారమేనంటూ చేతులు జోడిస్తాడు. మాళవీయ సన్నిధిలో కుమార్తెకు ఆదర్శవివాహాన్ని జరిపించి, విశ్వ విద్యాలయంలో అనేక భవన నిర్మాణాలకు అర్థికంగా సహకరిస్తాడు. మహామానవులు ధనం యొక్క సద్వినియోగాన్ని ఈ విధంగా కోరుతూ ఉంటారు.
కర్మ, జీవితం రెండు అన్యోన్యాశ్రితాలు, వ్యక్తులు తాము ఆచరించే కర్మ యొక్క స్థాయిని బట్టి జీవిత సాఫల్యాన్ని స్పష్టంగా అంచనా వేసుకోవచ్చు. కర్మ అంటే శ్రమించటం కాదు. కేవలం శ్రమించటం గాడిదలు కూడా చేస్తాయి. ఉన్నత ఆదర్శాలతో జోడింపబడిన కర్తవ్య పాలనను కర్మయోగం అని అంటారు. దీని వల్లనే మానవుడు “విశ్వంభరుడు” కాగల్గుతున్నాడు.